డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే అక్రమ అరెస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే అక్రమ అరెస్ట్‌లు

Apr 16 2026 10:06 AM | Updated on Apr 16 2026 10:06 AM

తాడేపల్లిరూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్‌ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్‌ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్‌ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌

ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు

Advertisement
 
Advertisement
Advertisement