కోర్టు భవనాల సముదాయానికి స్థలం కేటాయించండి | - | Sakshi
Sakshi News home page

కోర్టు భవనాల సముదాయానికి స్థలం కేటాయించండి

Apr 16 2026 10:06 AM | Updated on Apr 16 2026 10:06 AM

బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు భవనాల సముదాయానికి స్థలం కేటాయింపు చేయాలని బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్‌తోపాటు పలువురు జిల్లా కలెక్టర్‌డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌కు కలిసి కోరారు. బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా బుధవారం మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు. కోర్టు భవనాల సముదాయంతోపాటు, బార్‌ అసోసియేషన్‌ సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయాలపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్‌ తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉపాధ్యక్షులు కె రవిబాబు, ప్రధాన కార్యదర్శి సి. ప్రేంచంద్‌, పూర్వ అధ్యక్షులు కె.అవినాష్‌, వై.నరేష్‌, డి.హెచ్‌.బెంజ్‌, బి.స్టాన్లీ, ఎం.శ్యామలాదేవి, ఏ.మాధురి, బి.నాగప్రసాద్‌, వై.రామకోటి, పి.మురళీకృష్ణ,, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

కలెక్టర్‌కు న్యాయవాదుల వినతి

Advertisement
 
Advertisement
Advertisement