బాపట్ల: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో వివిధ హోదాలలో పలువురిని నియమించారు. బాపట్ల జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా బాపట్లకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డిని, సెక్రటరీగా బాపట్లకు చెందిన నట్టల కృపాసుమన్‌ను నియమించారు. బాపట్ల మున్సిపాల్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా పాగోలు నారాయణరావును నియమించారు. జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షులుగా అద్దంకికి చెందిన మద్దినేని అశోక్, బాపట్లకు చెందిన దుద్దుకూరి భాస్కరరావు, జిల్లా జనరల్ సెక్రటరీలుగా బాపట్లకు చెందిన పెరికల జోసఫ్, చీరాలకు చెందిన డి.వెంకట సుబ్బారావు, బక్కా శ్రీనివాసరెడ్డి, రేపల్లెకు చెందిన కసుకుర్తి దిలీప్‌కుమార్, వేమూరుకు చెందిన కె.పిచ్చయ్యశాస్త్రి, కోళ్లపూడి అశోక్‌కుమార్, పర్చూరుకు చెందిన కె.రామ్‌ప్రసాద్, సెక్రటరీలుగా అద్దంకికి చెందిన కె.సాంబశివరావు, చీరాలకు చెందిన కేసన శ్రీను, కాగితాల ప్రకాశ్, వేమూరుకు చెందిన జి.రామిరెడ్డి, ఎం.గోపయ్య, పర్చూరుకు చెందిన అక్కల రామిరెడ్డి, తాళ్లూరి అమరేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎం.ప్రకాశ్ (అద్దంకి), పి.ఎస్.ఆనంద్‌కుమార్ (బాపట్ల), షేక్.మహబూబ్‌వలి (బాపట్ల), కె.వెంకటేశ్వర్లు (చీరాల), కె.ఆనంద్‌కుమార్ (చీరాల), జె.రమేష్ (రేపల్లె), పిట్టు హైమా శ్రీనివాసరెడ్డి (రేపల్లె), ఎస్.ఎస్.ప్రసాద్ (రేపల్లె), ఎన్.వెంకటేశ్వరరావు (రేపల్లె), జి.నాగేశ్వరరావు (వేమూరు), ఎస్‌కె.అసీఫుల్లా (పర్చూరు), పి.సుబాష్ (పర్చూరు)లను ఎంపిక చేశారు.


