మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ ● వేమవరంలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

భట్టిప్రోలు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సర్వ సమానత్వానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని మంగవారం భట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ అన్నారు. ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన నిరూపించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలు చేరుకున్నప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్లని పేర్కొన్నారు. ‘స్టాచ్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’నే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో ఆవిష్కరించారని గుర్తుచేశారు. దీనిని 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైందని తెలిపారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన స్మృతివనం, అంబేడ్కర్‌ జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం పర్యాటకులకు ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన జంగం చంద్రశేఖర్‌, ఐనంపూడి ఏసుదాసు తదితరులను నాగార్జున అభినందించారు. విశ్రాంత హెడ్‌మాస్టర్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జంగం సుబ్బారావు, గ్రామానికి చెందిన మానేపల్లి చెంచులక్ష్మి సహకారం అందించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఆర్‌ఈఎఫ్‌ డైరెక్టర్‌ రెబ్బా ఇమ్మానియేల్‌, వేమూరు నియోజకవర్గ మజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ బొల్లిముంత ఏడుకొండలు, న్యాయవాది డేవిడ్‌ విజయ్‌ కుమార్‌, కనపర్తి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement