మానవ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

మానవ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: మానవ హక్కుల కోసం పోరాడిన ప్రపంచ మేధావిగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈటీసీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా జిల్లా కలెక్టర్‌ జ్యోతి వెలిగించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌తో పాటు అతిథులు పుష్ప మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ చరిత్రపై రూపొందించిన కరపత్రాలను కలె క్టర్‌ విడుదల చేశారు. తొలుత 94 మందికి రూ.1.22 కోట్లు విలువచేసే 94 యూనిట్లను జిల్లా కలెక్టర్‌ పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి యువత అంబేడ్కర్‌ వలే కష్టపడి చదివి, దేశానికి ఉపయోగపడేలా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని, సందర్శిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాలలో పౌరహక్కుల రోజును జయప్రదంగా జరుపుతామని కలెక్టర్‌ ప్రకటించారు. ఆయన చరిత్రపై ప్రత్యేకంగా వర్క్‌షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే నాయకుడు కాదని, ప్రపంచానికి నాయకుడుగా అభివర్ణించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక భవనానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement