మంగళగిరి టౌన్: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి విమర్శించారు. మంగళగిరిలో ఐద్వా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువతకు అందుతున్నాయన్నారు. చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పడం తప్ప కార్యాచరణ లేదని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులో గంజాయి దొరకడం వలన వారి భవిష్యత్ నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వలన పనిదినాలు తగ్గిపోయాయని తెలిపారు. మహిళలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మహిళలకు భద్రత లేకపోవడంతో అత్యాచారాలు, దాడులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలియజేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస కుమారి మాట్లాడుతూ పసిపిల్లలు సైతం దాడులకు గురికావాల్సి వస్తోందని, సమాజంలో సీ్త్ర విముక్తి కోసం మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఐద్వా పనిచేస్తుందని అన్నారు. దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై త్వరితగతిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, నాయకులు పాల్గొన్నారు.
సెంట్రల్ జోన్ సీనియర్ టీ–20 విజేత గుంటూరు జిల్లా జట్టు
Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM
సెంట్రల్ జోన్ సీనియర్ టీ–20 విజేత గుంటూరు జిల్లా జట్టు
గుంటూరు వెస్ట్(క్రీడలు): మూలపాడులోని ఏసీఏ క్రీడా మైదానంలో ఈనెల 11 నుంచి జరిగిన సీనియర్ టీ–20 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచిందని జీడీసీఏ త్రీమెన్ కమిటీ సభ్యులు టీవీ శివరామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల జట్లపై వరుస విజయాలతో సెంట్రల్ జోన్ విజేతగా నిలిచిందన్నారు. యువ జట్టు సమష్టిగా ఆడి వరుస విజయాలు నమోదు చేసిందని తెలిపారు. జట్టు కెప్టెన్‌గా ఎస్.కే రషీద్, కోచ్‌గా సరస్వతిరెడ్డి వ్యవహరించారన్నారు. అద్భుతంగా రాణించిన గుంటూరు జిల్లా జట్టును త్రీమెన్ కమిటీ సభ్యులు టీ.వీ.శివరామకృష్ణ, జీవీ శరత్‌బాబు, సీహెచ్‌వీ నాగరాజు అభినందించారు. అంబటి రాంబాబుకు 35(3) బీఎన్‌ఎస్‌ఎస్ నోటీస్
గుంరూరు లీగల్: వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషనన్‌లో 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి తండ్రి నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై క్రైమ్ నెంబర్ 25/2026గా కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి దర్యాప్తు అధికారి, వేంపల్లి పోలీస్‌స్టేషన్ అధికారులు అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులో సూచించిన విధంగా, నోటీసు స్వీకరించిన నాటి నుంచి వారం రోజుల్లోపు పోలీస్‌స్టేషన్‌న్‌కు హాజరై, బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 (క్లాస్–3) ప్రకారం అవసరమైన విధంగా దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు నోటీసును స్వీకరించినట్లు సమాచారం. నోటీసులో పేర్కొన్న విధంగా తాను నిర్దేశిత కాలవ్యవధిలో పోలీస్ స్టేషన్‌న్‌కు హాజరై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని మీడియా ద్వారా వెల్లడించారు. అందువల్ల చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతుందని, సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవటానికి సాక్ష్యాధారాలు ప్రకారంగా ఉంటుందని సమాచారం. గంజాయిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
Advertisement


