గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్‌ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్‌ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్‌శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు.
దానశీలత కలిగిన రాడికల్ హ్యూమనిస్ట్ సుబ్బారావు
Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM
దానశీలత కలిగిన రాడికల్ హ్యూమనిస్ట్ సుబ్బారావు ఇంకొల్లు(చినగంజాం): రావి సుబ్బారావు దాతగా, విద్యావేత్తగా ఎంతో కృషి చేశారని భారత హేతువాద సంఘం ట్రెజరర్ షేక్ బాబు అన్నారు. ఇంకొల్లు రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్‌లో రాడికల్ హ్యూమనిస్ట్ రావి సుబ్బారావు వర్ధంతి నిర్వహించారు. భారత హేతువాద సంఘం ప్రధానకార్యదర్శి మేడూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. రావి సుబ్బారావు జీవితం ఉద్యమ కృషి గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. 1991లో ఇంకొల్లు రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ స్థాపన కోసం ఆయన తమ విలువైన 10 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చి హేతువాద మానవవాద ఉద్యమానికి ఆశ్రయాన్ని కల్పించారన్నారు. కార్యక్రమంలో తెలంగాణా హేతువాద సంఘ అధ్యక్షుడు కే శ్రీనివాసాచారి, ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు కరణం రవీంద్రబాబు, షేక్ దరియావలి, కాకి రాజశేఖర్, రేజేటి వెంకటేశ్వర్లు, కళ్యాణం చంద్రశేఖర్, నల్లమోతు రాధాకృష్ణ, అబ్రహం లింకన్, రాయని వీరయ్య, కాకర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని రావి సుబ్బారావుకు నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు రాడికల్ హ్యూమనిస్ట్‌లు రచించిన పలు గ్రంథాలను ఆవిష్కరించారు.
మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు నరసరావుపేట టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించగా భర్త ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె ప్రాణాలు కాపాడిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు వల్లపుచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో తలుపులు గడియపెట్టుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన భర్త విషయాన్ని టూటౌన్ సీఐ ప్రభాకర్‌కు విషయం తెలియజేశాడు. సమయస్పూర్తిగా వ్యవహరించిన సీఐ సంఘటనా సమీపంలో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ కరిముల్లాను అప్రమత్తం చేశాడు. వెంటనే అక్కడకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అప్పటికే ఉరివేసుకొనే ప్రయత్నంలో ఉన్న మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఈ సందర్భంగా స్థానికులు పోలీసుల సేవలను ప్రశంసించారు.
రోడ్డు ప్రమాదంలో
పెయింటర్ మృతి మాచర్ల: పట్టణానికి చెందిన పెయింటర్ భోజనం చేసేందుకు తాను నివాసముండే సుద్దగుంతల ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై గుంటూరు రోడ్డు నుంచి చెన్నకేశవస్వామి కాలనీకి వస్తుండగా ఎదురుగా వాహనం వస్తుండటంతో ఆందోళన చెంది బైకు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. సుద్దగుంతల ప్రాంతానికి డేగల రాజు (27) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. గుంటూరు రోడ్డులోని చెన్నకేశవ కాలనీలో పనులు నిమిత్తం తిరిగి వస్తుండగా మధ్యాహ్న సమయంలో ఎదురుగా స్పీడుగా వాహనాలు వస్తుండటంతో వాటిని తప్పించే ప్రయత్నంలో అతని బైకు బోల్తాపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమంచి విజయభాస్కర్
శాస్త్రికి డాక్టరేట్
Advertisement


