కాయ్ రాజా.. కాయ్!
న్యూస్‌రీల్
కొల్లూరులో బహుమతుల ఎర
పాతిక ఎకరాల్లో బరి
నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం వివరాలు
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
జిల్లాలో జోరుగా కోడి పందేలు
అధికార పార్టీ నేతల అండదండలు
చెరుకుపల్లి తూర్పుపాలెంలో భారీ బరి
అంతే జోరుగా పేకాట శిబిరాలు
చుట్టుపక్కల జిల్లాల నుంచి జనం రాక
రూ. కోట్లలో చేతులు మారుతున్న నగదు
కనీసం కన్నెత్తి చూడని అధికారులు
బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద 25 ఎకరాల్లో భారీ బరిని ఏర్పాటు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో ఇసుక దందా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడు ఈ బరిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కోడి పందేలతోపాటు పెద్ద ఎత్తున పేకాట నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఇక్కడ కోడిపందేలతోపాటు పేకాట మొదలు కానుంది. భారీ హంగులతో, వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేసి మరీ ఈ బరిని సిద్ధం చేశారు. ఇక్కడా రూ.కోట్లలోనే పేకాట జరగనుంది. కోడి పందేలు ఆడేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి జూదప్రియులు తరలివస్తున్నారు. ఈ బరి వద్ద మద్యంతోపాటు అన్నిరకాల దుకాణాలు ఏర్పాటు చేశారు.
బాపట్ల
I
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం బరిలో మంగళవారం పెద్ద ఎత్తున కోడిపందేలు జరిగాయి. బరులు నాలుగురోజుల ముందే సిద్ధమైనా సంక్రాంతి తొలిరోజు బుధవారం నుంచి పందేలు ఉంటాయని భావించారు. ఐతే ఒక రోజు ముందు నుంచే పందేలు మొదలు పెట్టారు. 60 ఎకరాల బరిలో పలు చోట్ల కోడి పందేలు నిర్వహించారు. మరోవైపు ఇదే బరిలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు కొనసాగాయి.
వేమూరు నియోజకవర్గంలో వేమూరులో కోడి పందేల బరిని ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రారంభించారు. చావలి– కోడిపర్రు మధ్యన, చుండూరు మండలం వేటపాలెం వద్ద బరులు సిద్ధం చేశారు. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గంజాంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో కోడి పందేలు జరగనున్నాయి. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లోని సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించనున్నారు. అధికార పార్టీ నేతలే వీటిని నిర్వహిస్తుండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ప్రెస్‌మీట్లు పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పండుగ పేరుతో సామాన్యుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.2500, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 555.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 45,242 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.7890 టీఎంసీలు.
కొల్లూరు: కోడి పందేల జోరు కొల్లూరు మండలంలో ఊపందుకుంది. సంక్రాంతి సంబరాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు బరి తెగించి ఈ పందేలతోపాటు జూద క్రీడలకు తెరలేపారు. జనం బలహీనతను సొమ్ము చేసుకొని కాసులు దండుకోవడమే లక్ష్యంగా సకల సౌకర్యాలతో బరులను సిద్ధం చేశారు. కోడి పందేలు, పేకాట, గుండాట వంటి క్రీడలకు వసతులు కల్పించారు. బరుల వద్దే మద్యం కౌంటర్లను తెరిచారు. కొల్లూరు మండలంలోని క్రాప అడ్డరోడ్డు, అనంతవరం వద్ద పందేలు జోరుగా సాగాయి. వీటిని నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు కార్లు, ద్విచక్ర వాహనాలను బహుమతులుగా ఇస్తామని వల విసిరారు. కొల్లూరు టీడీపీలో ఉన్న రెండు వర్గాలు పోటాపోటీగా వ్యవహరిన్నాయి.
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!
కాయ్ రాజా.. కాయ్!


