దూరమైన సంప్రదాయాలు
ప్రత్తిపాడు: సంక్రాంతి.. అంటేనే సంప్రదాయాల కలబోత. ఆ పండుగతో పెనవేసుకున్న సంప్రదాయాలు, సంబరాలు, సరదాలు, అనుభూతులు అన్నీ ఇన్నీ కావు. తెలుగునాట మూడు రోజులపాటు ఉట్టిపడే ఈ పండుగ కళకు తాతల నాటి నుంచి వచ్చే అతిథులు ఎందరో ఉన్నారు. అతిథులంటే మనకు తెలిసిన బంధుమిత్రులు కాదండోయ్... సంక్రాంతి సరదాలను, సంప్రదాయాలు, సంస్కృతినీ మోసుకొచ్చే వారు. కాలం మారుతున్నా.. అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నా మన సంస్కృతీసంప్రదాయాలను మరిచిపోకుండా అరుదుగా అక్కడక్కడా ఇంకా మన మూలాలను వారు గుర్తుచేస్తున్నారు.
తెల్లవారకముందే తెల్లటి వస్త్రాల్లో తలపై అక్షయపాత్రతో, చేతిలో చిడతలతో హరిలో రంగ హరి.. అంటూ హరి నామస్మరణ చేస్తూ భక్తి గీతాలాపనలతో ఇంటి ముంగిటకు వస్తారు హరిదాసులు. ధనుర్మాసం ఆరంభం నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకు వీధుల్లో సంచరిస్తూ ప్రజలు ఇచ్చే ధాన్యం, పిండివంటలు, కానుకలను స్వీకరిస్తారు. సంక్రాంతి సంప్రదాయానికి వీరిని ప్రతీకలుగా చెప్పవచ్చు.
గంగిరెద్దులు.. ఈ పేరు చెప్పగానే ముందుగా తెలుగునాట గుర్తుకొచ్చేది మూడురోజుల సంక్రాంతి పండుగ. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచే గ్రామాల్లో గంగిరెద్దుల సందడి కనిపిస్తుంటుంది. బసవన్నా.. అయ్య గారికి దండమెట్టు.. అంటూ పోషకులు గంగిరెద్దులతో ఇళ్ల ముంగిట చేయించే విన్యాసాలు, ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రజలు వీరికి ధనధాన్యాలు, వస్త్రాలు సమర్పిస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు గంగిరెద్దుల విన్యాసాలు చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు.
చేతిలో ఢమరుకం.. ఒంటిపై నల్లని వస్త్రాలు.. ఒకదానిపై ఒకటి ధరించి తలకు పెద్ద పాగా చుట్టి, నుదుటిన పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని, పెద్ద మీసాలతో భుజంమీద జంపకానా, కోటు ధరించి సంక్రాంతి సమయంలో వీరు గ్రామాల్లో సంచరిస్తుంటారు. భక్తి సంబంధ విషయాలు, భవిష్యత్తును ప్రజలకు వివరిస్తూ నీతి బోధలు చేస్తుంటారు. ఈ జాతి వారు చాలా వరకు కనుమరుగైనప్పటికీ, సంక్రాంతి వేళ మాత్రం గ్రామాల్లో అక్కడక్కడా అరుదుగా కనిపిస్తుంటారు.
మన పూర్వీకుల కాలంలో కొమ్మదాసరులు సంక్రాంతి వేళ అధికంగా కనిపించేవారట. వీరు గ్రామాల్లో ఉన్న చెట్లపై కనిపించకుండా కూర్చుని దారిన వచ్చేపోయే వారి జాతకాలను వెటకారంగా, వ్యగ్యంగా చెప్పేవారట. రానురానూ కాలం మారడంతో ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితులు లేకపోవడంతో, వారే ఓ కొమ్మను చేతిలో పట్టుకుని వేకువజాము నుంచే తిరుగుతున్నారు. కనిపించిన వారందరినీ బంధుమిత్రుల వరసలతో పిలుస్తూ సరదా సరదాగా అల్లరి చేస్తుంటారని చెబుతున్నారు. వీరు కూడా ప్రస్తుతం కనిపించని పరిస్థితి.
వీరు సంక్రాంతి వేళ కాకుండా.. ఇతర రోజుల్లోనూ గ్రామాల్లో కనిపిస్తుంటారు. వీరికి శివ శిష్యులుగా గ్రామాల్లో పేరు. మెడలో శివలింగం, నుదుటిన విభూది, చేతిలో శంఖం ధరించి భుజానికి సంచీతో గ్రామాల్లో సంచరిస్తుంటారు. ప్రజలు ఇచ్చే భిక్షను స్వీకరించి జంగమేశ్వరునికి వినిపించేలా ఇంటి ముంగిట నిలబడి శంఖం ఊది వెళ్లిపోతారు.
● అలనాటి సంక్రాంతి పండుగ
నిర్వహణ తీరే వేరు
● కళాకారులతో గ్రామీణ
ప్రాంతాల్లో పెద్ద పండుగ హుషారు
● నేడు అక్కడక్కడే కనిపిస్తున్న
నాటి సంప్రదాయ గురుతులు
హరిదాసులు..
గంగిరెద్దుల విన్యాసాలు..
బుడబక్కల వారు..
కొమ్మదాసరులు..
జంగమ దేవరులు..
గ్రామంలో హరిదాసు సంచారం (ఫైల్)
బుడబక్కల వారు (ఫైల్)
1/2
దూరమైన సంప్రదాయాలు
2/2
దూరమైన సంప్రదాయాలు