
సైనిక నియామకాల్లో పారదర్శకత
వేటపాలెం: సైనిక నియామకాల్లో పారదర్శకత పాటిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ అనుదీప్ కుమార్ పేర్కొన్నారు. చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ క్యాంపులో ఎన్‌సీసీ క్యాడెట్లకు సైనిక నియామకాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైన్యంలో జవాన్లు, నాన్ కమీషన్డ్ అధికారులు, టెక్నికల్ ఎంట్రీ, ఆర్మీ నర్స్‌లు, లాజిస్టిక్స్ తదితర విభాగాల ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. సైనిక నియామకాలపై నేరుగా అధికారిక వెబ్‌సైట్ లేదా సైనిక రిక్రూట్‌మెంట్ కార్యాలయాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా యువతకు శారీరక, మానసిక తయారీ కోసం పలు సూచనలు ఇచ్చారు. సైనికాధికారిని ఘనంగా సన్మానించారు. కెప్టెన్ పోతూరి శ్రీనివాస్, లెఫ్ట్‌నెంట్ హరీష్, రాజేష్‌బాబు, దివ్య, శ్రీమన్నారాయణ, శేషగిరిరావు, ఫాతిమా, గోపీనాథ్, సుబేదార్ ముకేశ్‌కుమార్, సబూర్, అవతార్‌సింగ్ పాల్గొన్నారు.
అర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ అనుదీప్ కుమార్