
ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రికార్డు
వేటపాలెం: పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి విద్యార్థిని సజ్జా దివ్యశ్రీ 596 మార్కులతో రికార్డు సృష్టించింది. బాలికది చేనేత కుటుంబం. తండ్రి రామకృష్ణ 104లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. దివ్యశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం స్కూల్స్‌లో ఉత్తమ బోధన అందిస్తున్నారని, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడినట్లు తెలిపింది. ఎస్‌పీఈసీ (స్పెషన్ చానల్ ఫర్ ఎడ్యుకేషన్) ఎంట్రన్స్ పరీక్షలు రాసి హైదరాబాదులోని ఐఐఐటీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చదువడమే లక్ష్యమని పేర్కొంది.