ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్‌ఓలదే కీలక పాత్ర
బాపట్ల:ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్ ఓల పాత్ర అత్యంత కీలకమైందని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బీఎల్‌ఓలకు ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా రూపొందించడంలో బీఎల్‌వోలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెయ్యి ఓట్లు దాటితే రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సందర్భంలో వారందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, తహసీల్దార్లు షేక్ సలీమా, సుందరమ్మ, వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు మల్యాద్రి, బీఎస్పీ నాయకులు కాగిత కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దోనేపూడి రవి, జనసేన నాయకులు బీఎల్వోలు పాల్గొన్నారు.
బాపట్ల ఆర్డీఓ గ్లోరియా


