పీహెచ్‌సీలలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు
అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. మాదిపాడు పీహెచ్‌సీ పరిధిలోని చింతపల్లి, మాదిపాడు సబ్ సెంటర్స్‌లో జరిగే సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్‌ఓ పలు సూచనలు చేశారు. చిన్న పిల్లల వాక్సినేషన్‌ను వేసవి దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు ముగించాలని తెలిపారు. అనంతరం పీహెచ్‌సీ కార్యకలాపాలపై వైద్యాధికారి డాక్టర్ ఎం.ఇన్నారావును అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో జిల్లా ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ డి.హనుమకుమార్ పాల్గొన్నారు. అచ్చంపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ స్రవంతి, మాదిపాడు సీహెచ్‌ఓ హర్ష వర్ధన్, శివ నాగేశ్వరి, ఆరోగ్య విస్తరణ అధికారి పి.వెంకటరావు, హెల్త్ ఎడ్యుకేటర్ పార్వతి, సూపర్‌వైజర్ పి.రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
జిల్లా వైద్యశాలలో పర్యటించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్భన్: తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం కాయకల్ప బృందం పర్యటించింది. మంగళగిరిలోని నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు డాక్టర్ నిర్మలగ్లోరి, డాక్టర్ స్టెఫిగ్రేస్‌లు తల్లీపిల్లల వైద్యశాలలోని పలు వార్డులు, ఆపరేషన్ ఽథియేటర్, జిల్లా వైద్యశాలలోని పలు వార్డులు, ల్యాబ్‌లను పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ నిర్మల గ్లోరి మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా తెనాలి రావటం జరిగిందన్నారు. ఆస్పత్రిలో నిబంధనలకు అనుగుణంగా రోగులకు సేవలు అందింస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో శానిటేషన్ బాగోకపోతే ఇన్‌పెక్షన్ సోకే అవకాశం ఉంటుందన్నారు. దానిపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు వివరించారు. జిల్లా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. వారి వెంట వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి ఉన్నారు.
పీహెచ్‌సీలలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు


