Weekly Horoscope: ఈ రాశి వారికి వారం చివరలో ఆకస్మిక ధనలాభం

Weekly Horoscope Telugu 13-11-2022 To 19-11-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది.  స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతల నుంచి విముక్తి.  కళారంగం వారి ఆశలు కాస్త నిరాశ పరుస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి, ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. 

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులు  ముందుకు సాగక కొంత  నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరట నిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కొత్త  బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి. 

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
శ్రమకోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పు, ఓర్పుతో పరిష్కరించు కుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం చివరిలో  పరిస్థితులు అనుకూలించవు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఇంటాబయటా మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు.  ఆకస్మిక ధనలాభ సూచనలు.  వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగాలలో  కొత్త విధులు చేపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో  ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఉద్యోగార్ధుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి.  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణయత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  ఖర్చులు అధికం. బంధు విరోధాలు. తెలుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం. కళారంగం వారికి ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు.  వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి.  వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో  ఖర్చులు. కొన్ని అంచనాలు తప్పుతాయి. గులాబీ, పసుపు రంగులు.ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటì నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో అదనపు బా«ధ్యతలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది.  ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం.  వ్యాపారాలలో  ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  కొంత ఊరట లభిస్తుంది. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్తోత్రాలు పఠించండి.  

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి. ఆరోగ్య పరంగా కొంత చికాకు ఎదురుకావచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో  పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. హనుమాన్‌ చాలీసా పఠిచండి. 

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పర్చినా అ«ధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటి నిర్మాణాలు కాస్త నిదానిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి కార్యద్ధి. వారం  ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. 

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. ఇంట్లో వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి  వస్తాయి.  వ్యాపారాలలో  స్వల్ప  లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. వారం  ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని స్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top