ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు | Sakshi
Sakshi News home page

Weekly Horoscope in Telugu: ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Published Sun, Dec 10 2023 6:48 AM

Weekly Horoscope Telugu 10-12-23 To 16-12-23 - Sakshi

మేషం..
కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊహించని విధంగా  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు  ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  విష్ణుధ్యానం చేయండి. 

వృషభం..
సంఘంలో మరింత గౌరవం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు.  పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం..
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో లేనిపోని ఖర్చులు. మానసిక ఆందోళన. తెలుపు, కాఫీరంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..
నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడురంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.

సింహం..
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు. నీలం, లేత పసుపురంగులు, గణపతి అర్చనలు చేయండి.

కన్య..
పనులు కొంత మందగిస్తాయి. బంధుమిత్రులతో  అకారణంగా విభేదాలు. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలలో కొద్దిపాటి  లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు వారం మధ్యలో శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. సన్మానాలు. గులాబీ, లేత నీలం రంగులు.  లక్ష్మీస్తుతి మంచిది. 

తుల..
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై సంభాషిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి కళారంగం వారికి విదేశీ పర్యటన లు. వారం చివరిలో  ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి. 

వృశ్చికం..
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి  మరింత మెరుగ్గా ఉంటుంది. బంధువులతో  కష్టసుఖాలు పంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు.  పసుపు,ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది. 
 
ధనుస్సు..
అనుకున్న∙పనులు విజయవంతంగా సాగుతాయి.  శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కారం. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి  అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. ఎరుపు, నేరేడు రంగులు. గులాబీ, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం..
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. వ్యతిరేకులే మీపై ఆదరణ చూపుతారు. మీచొరవతో కొన్ని వివాదాలు తీరతాయి.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.  ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ, సాంకేతికవర్గాల వారికి నూతనోత్సాహం.వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం సహకరించదు. పసుపు, ముదురు ఎరుపురంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం..
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. మనశ్శాంతి లోపం.  నీలం, పసుపురంగులు,నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం..
పనులలో  జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపురంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

Advertisement
 
Advertisement