ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం, విందు వినోదాల్లో పాల్గొంటారు

Today Horoscope 28-05-2023 - Sakshi

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.అష్టమి ఉ.7.09 వరకు, తదుపరి నవమి, నక్షత్రం పుబ్బ రా.11.54 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం ఉ.6.21 నుండి 8.04 వరకు; దుర్ముహూర్తం సా.4.40 నుండి 5.54 వరకు;  అమృత ఘడియలు: సా.4.53 నుండి 6.38 వరకు; రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు; యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు; సూర్యోదయం 5.29; సూర్యాస్తమయం: 6.25 

మేషం: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. భూలాభాలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పవు.

తుల: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృశ్చికం: చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ప్రయాణాలు విరమిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు ఉంటాయి. ఉద్యోగాలలో  ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడులు.

మకరం: సన్నిహితులు, సోదరులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడతారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

మీనం: కొత్త మిత్రుల పరిచయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top