
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.విదియ రా.12.35 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అనూరాధ ఉ.10.24 వరకు,తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.4.29 నుండి 6.13 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు,అమృత ఘడియలు: రా.2.51 నుండి 4.26 వరకు.
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
మిథునం.... పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
సింహం... రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కన్య.... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
తుల..... శ్రమ తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తుంది.
వృశ్చికం... సోదరుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. భూలాభాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.
ధనుస్సు.... రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం.... సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గుతాయి.
కుంభం... కొత్త పనులు చేపడతారు. ఊహించని ఆహ్వానాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
మీనం... వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.