
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి రా.9.03 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: విశాఖ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.11.40 నుండి 1.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు అమృతఘడియలు: రా.10.16 నుండి 12.03 వరకు, మహ వైశాఖి, బుద్ధపూర్ణిమ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.18.
మేషం...... సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.
వృషభం... సన్నిహితులతో సఖ్యత. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి.
మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.
కర్కాటకం... ప్రయాణాల్లో మార్పులు. అనుకోని ధన వ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు చిక్కులు.
సింహం... ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దైవచింతన. ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి.
కన్య... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.
తుల..... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ధన,వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. వాహనయోగం.
వృశ్చికం..... ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారులకు నిరుత్సాహం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యస్థితి.
ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయత్నాలలో కదలికలు. వ్యాపారులు ముందడుగు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దైవచింతన.
మకరం... ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
కుంభం.... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
మీనం... బంధువులు విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.