మేషం...
మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యవహారాలను చక్కబెట్టడంలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలను అతి చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం కలిగే అవకాశాలున్నాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఇంతకాలం వేధిస్తున్న ఒక వివాదం తీరే సూచనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. పసుపు, నేరేడు రంగులు,కనధారాస్తోత్రాలు పఠించండి.
వృషభం...
అనుకున్న కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి కాగలవు. ఆప్తులు, సన్నిహితులు సరైన సమయంలో సహాయపడతారు. కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుండి ఒత్తిడులు. కొన్ని ఒప్పందాలలో మార్పులు చేస్తారు. లేత ఎరుపు, బంగారు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.
మిథునం...
కొద్దిపాటి చికాకులు కలిగినా తెలివిగా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వారు పరిచయమవుతారు. కుటుంబంలో శుభకార్యాలలో జరుపుతారు. ఒక నిర్ణయంపై కుటుంబసభ్యుల అభిప్రాయం కోరతారు. వ్యాపారాలు విస్తరణకు సమాయత్తమవుతారు. ఈదిశగా పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతుంది.. కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, నలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం...
ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు తొలగుతాయి. కొంత సొమ్ము హఠాత్తుగా రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ప్రముఖుల నుండి కీలక విషయాలపై సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా ఎక్కడా రాజీలేకుండా పనిచేస్తారు. రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ధనవ్యయం. తెలుపు, లేత ఎరుపు రంగులు, శ్రీ గణేశ్‌ను పూజించండి.
సింహం...
కొన్ని వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఎటువంటి వివాదమైనా స్వీయ ఆలోచనలతో పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు కలలు ఫలిస్తాయి.ఆర్థికంగా కొంత పుంజుకుంటారు.. బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది రాదు. అలాగే, తగినంత లాభాలు సైతం దక్కుతాయి. ఉద్యోగులు విధులు చక్కబెట్టడంలో పట్టుదలతో పనిచేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్ట.కం పఠించండి.
కన్య...
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలను స్వీకరించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ముఖ్య, సమావేశంలో పాల్గొంటారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కోర్టు కేసులపై ఒక నిర్ణయం రావచ్చు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను నడిపించడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. మొత్తానికి లాభాలబాట పడతారు. ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఒక కీలక పదవి దక్కే అవకాశం. వారం మధ్యలో శ్రమ తప్పదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు. తెలుపు, లేత నీలం రంగులు, దేవీస్తుతి మంచిది.
తుల...
అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయడంలో శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఎదురై అవసరాలకు ఇబ్బందిపడతారు. బ«ంధువులతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏ మాత్రం కలసిరావు. ఇంటాబయటా చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు మరింత నిరాశ చెందుతారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కళాకారులు తొందరపాటుతో అవకాశాలు చేజార్చుకుంటారు. వారం మద్యలో శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. గులాబీ, బంగారు రంగులు, అంగారకస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
కొద్దిపాటి చికాకులు ఏర్పడినా సర్దుకుంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషులు మరింత సహాయపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు సఫలం కాగలవు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులు కొత్త పంథాలు అనుసరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మానసిక ఆశాంతి. దూరప్రయాణాలు. ఎరుపు, బంగారు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు..
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆదాయం మరింత పెరిగి సంతృప్తినిస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. భాగస్వాములతో వివాదాలు సర్దుకుని వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు విధులు చక్కబెట్టడంలో శ్రమను లెక్కచేయరు. కళాకారుల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. కష్టానికి ఫలితం కనిపించదు. మానసిక ఆందోళన. పసుపు, ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.
మకరం....
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుంటారు. ఖర్చులు కొంతమేర తగ్గించుకుంటారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగి, లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు గౌరవం పెరుగుతుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి..
కుంభం...
కొత ్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. రాబడి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుస్తారు. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. వ్యయప్రయాసలు. స్వల్పఅనారోగ్యం. నీలం, తెలుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.
మీనం....
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్యులతో సమావేశమవుతారు.రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో చిక్కులు వీడతాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒక సంతోషకర సమాచారం అందుతుంది.. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. శ్రమా«ధిక్యం. తొందరపాటు నిర్ణయాలు. బంగారు, ఆకుపచ్చరంగులు, రామరక్షాస్తోత్రాలు పఠించండి.


