దిన ఫలం: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే...

Today Horoscope 14 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శనివారం,  భోగి పండుగ
సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.39

 
తిథి: బ.సప్తమి ప.2.30 వరకు, తదుపరి అష్టమి,
నక్షత్రం: హస్త ప.2.11 వరకు, తదుపరి చిత్త,

వర్జ్యం: రా.10.21 నుండి 11.58 వరకు,
దుర్ముహూర్తం: ఉ.6.39 నుండి 8.07 వరకు,

అమృతఘడియలు: ఉ.7.52 నుండి 9.31 వరకు,
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు,

మేషం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో సాగుతాయి.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులలో ఆటంకాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. మంచి విషయాలు తెలుస్తాయి. ఉద్యోగప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: రుణదాతల ఒత్తిడుల నుండి బయటపడతారు. పనుల్లో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. భూవివాదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు: గతం గుర్తుకు వస్తుంది. వ్యవహారాలలో విజయం. భూవివాదాలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మకరం: పరిస్థితుల ప్రభావంతో ప్రయాణాలు వాయిదా. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: పనులు మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

మీనం: అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

మరిన్ని వార్తలు :

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top