గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.ఏకాదశి రా.9.15 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: స్వాతి సా.6.18 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: రా.12.23 నుండి 2.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.44 వరకు తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు, అమృత ఘడియలు: ఉ.8.55 నుండి 10.35 వరకు, సర్వ ఏకాదశి.
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం: కార్యజయం. కొన్ని అంచనాలు నిజం కాగలవు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గతం గుర్తుకు వస్తుంది. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. భూవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
సింహం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు. సోదరులతో కలహాలు. స్వల్ప అనారోగ్యం. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల: కొత్త్త వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. వాహనాలు కొంటారు. తండ్రి తరఫున ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సిద్ధిస్తాయి.
వృశ్చికం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు: మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మీనం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో తగాదాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.


