గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.దశమి రా.8.14 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: చిత్త సా.4.39 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: రా.10.38 నుండి 12.20 వరకు, దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ఉ.9.56 నుండి 11.37 వరకు.
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.. కొత్త ఉద్యోగాన్వేషణలో సఫలం. విందువినోదాలు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
వృషభం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. పనుల్లో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.
మిథునం... కుటుంబంలో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి మాటపడతారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం..
కర్కాటకం... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి.
సింహం.... శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య... కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.
తుల..... పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం..... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
ధనుస్సు... సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం.... పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కొత్త ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కుంభం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం.. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.


