ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు.. కార్యజయం | Today Telugu Horoscope On April 6th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు.. కార్యజయం

Apr 6 2025 5:03 AM | Updated on Apr 6 2025 10:25 AM

Rasi Phalalu: Daily Horoscope On 06-04-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు,చైత్ర మాసం, తిథి: శు.నవమి రా.11.37 వరకు తదుపరి దశమి,నక్షత్రం: పునర్వసు ఉ.10.01 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.6.01 నుండి 7.35 వరకు, దుర్ముహూర్తం: ప.4.31 నుండి 5.20 వరకు, అమృత ఘడియలు: ఉ.7.37 నుండి 9.11 వరకు, శ్రీరామ నవమి.

సూర్యోదయం :  5.55
సూర్యాస్తమయం :  6.10
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

వృషభం... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

మిథునం... మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

కర్కాటకం.. ఆకస్మిక ధన, వస్తులాభాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం.... ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కన్య.... కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. ధనలాభం.

తుల... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఆశాజనకం. దైవచింతన.

వృశ్చికం.. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పనులు వాయిదా.

ధనుస్సు.... ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దూరప్రయాణాలు.

మకరం... కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.  

కుంభం... కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

మీనం.... మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement