రాశి ఫలాలు: ఇవాళ ఏ రాశివారికి ఎలాగ ఉందంటే..

Horoscope Today 09 03 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
సూర్యోదయం: 6.18, సూర్యాస్తమయం: 6.04.

తిథి: బ.విదియ రా.8.04 వరకు, తదుపరి తదియ,
నక్షత్రం: హస్త తె.5.11 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి చిత్త,

వర్జ్యం: ప.12.46 నుండి 2.27 వరకు,
దుర్ముహూర్తం: ఉ.10.11 నుండి 10.58 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు,
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు,

అమృతఘడియలు: రా.10.51 నుండి 12.33 వరకు;  

మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: నేర్పుగా వ్యవహరించడం మంచిది. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. బంధువిరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.

ధనుస్సు: ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బం«ధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.

కుంభం: శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో ప్రతిష్ఠంభన. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top