దినఫలం: ఈ రాశివారికి అనుకోని ప్రయాణాలు, ఇంకా ఏ రాశుల వారికి ఎలాగ ఉందంటే..

Horoscope Today 04 03 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
సూర్యోదయం :    6.21
సూర్యాస్తమయం    :  6.03
 

తిథి: శు.ద్వాదశి ఉ.11.57 వరకు, తదుపరి త్రయోదశి,
నక్షత్రం: పుష్యమి రా.7.03 వరకు, తదుపరి ఆశ్లేష,

వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ఉ.6.20 నుండి 7.55 వరకు, 
అమృతఘడియలు: ఉ.11.43 నుండి 1.43 వరకు, శనిత్రయోదశి.

రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కన్య: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్తహోదాలు.

మీనం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. కొన్ని పనులు మందగిస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top