ఎర్రగుంట్ల : విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆర్టీపీపీలోని ప్రధాన గేటు వద్ద విద్యుత్తు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించడంలో యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వేతన సవరణ సంప్రదింపుల కమిటీని నియమించాలని, కార్మికులను సంస్థఽలో విలీనం చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.


