మదనపల్లె టౌన్ : చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లను పత్రాలు లేని వ్యక్తులు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బాధితులు విలేకరులతో మాట్లాడారు. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ సర్వే నంబర్ 638 పార్ట్‌లోని ప్లాట్లను 2021లో మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. ప్లాట్లను కొనుగోలు సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సి.ఎమ్. రెడ్డి బతికున్నంత కాలం ఎవరూ జోలికి రాలేదని, ఇటీవల ఆయన మరణించడంతో కొందరు హక్కులు లేని వ్యక్తులు, భూకబ్జాదారులు ప్లాట్లలోకి చొరబడి సరిహద్దు రాళ్లను తొలగిస్తూ ఆస్తి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై గతంలోనే ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అక్రమార్కుల బారి నుంచి చట్టబద్ధమైన తమ ప్లాట్లను కాపాడి న్యాయం చేయాలని అధికారులను కోరారు. కాగా ఈ విషయమై శుక్రవారం భూమి తనదేనని భూ యజమాని సయ్యద్ బాషా, అతని సోదరులు తన భూమిని తులసీధర నాయుడు అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నట్లు ఆరోపించడం కొసమెరుపు.
కబ్జాకాకుండా కాపాడాలని
బాధితుల వేడుకోలు


