విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

మదనపల్లె సిటీ: విద్యార్థుల సమగ్రాభివృద్ధే సమగ్ర శిక్ష లక్ష్యమని సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎన్‌.అనూరాధ అన్నారు. జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో సాక్షితో మాట్లాడారు. పాఠశాలల విద్యార్థులకు అందాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్‌, నాడు–నేడు పనులు కేజీబీవీల పనితీరుపై ముచ్చటించారు.

నాడు..నేడు పాఠశాలలు

జిల్లాలో 448 పాఠశాలల్లో నాడు–నేడు రెండో దశలో ఆగిపోయిన నిర్మాణపనులపై మండల, జిల్లా కమిటీలు ఇచ్చే నివేదికలు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతాం. అవసరమైన చోట్ల నిర్మాణం పనులు చేపడతాం. ఈ దిశగా ఇప్పటికే ఇంజనీరింగ్‌, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతాం. పాఠశాలలకు సంబంధించి మైనర్‌ రిపేర్లను చేపట్టేందుకు అనుమతి ఇచ్చాం. దీనిపై మనబడి–మన భవిష్యత్తు అకౌంట్లలోని నిధులను వినియోగించుకోవచ్చు.

రూ.10 కోట్లతో మోడల్‌ ప్రైమరీలో టాయిలెట్ల నిర్మాణం

జిల్లాలోని 276 మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో రూ.10 కోట్లతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టను న్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. దీంతో పాటు 8 చోట్ల కేంద్రప్రభుత్వ సహకారంతో 5.57 కోట్ల బడ్జెట్‌తో బాలికల కోసం ప్రత్యేకంగా ఆధునిక టాయిలెట్లను కూడా నిర్మించనున్నాం.

బడి బయట పిల్లల కోసం

బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈఓలు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1వ తరగతిలో 9,559 మందిని చేర్పించాం. అలాగే జిల్లాలోని 25 భవిత కేంద్రాల పరిధిలో 212 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాం. వీరిందరిని భవిత కేంద్రాల్లో చేర్పించి వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు విద్యాబోధన కూడా అందిస్తాం. జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. మదనపల్లె (జెడ్పీహెచ్‌ఎస్‌), రాయచోటి(మాసాపేట) పీలేరు(కోటపల్లి),పుంగనూరు (మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలు) నిర్మాణపనులు ముగింపు దశకు చేరుకున్నాయి.

కేజీబీవీలలో నాణ్యమైన విద్య

జిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. జూనియర్‌ ఇంటర్‌ కమ్‌ డెర్మాటరీ నిర్మాణపనులు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. కేజీబీవీల్లో ఖాళీగా 22 పీజీటీ,సీఆర్‌టీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చాం. జూన్‌ 26వతేదీలోపు కొత్త టీచర్లు ఆయా కేజీవీవీలో విధుల్లో చేరుతారు. ఈ ఏడాది నుంచి స్నానానికి వేడి నీటి సదుపాయం కల్పించేందుకు సోలార్‌ ఫలకలు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్తులకు వి ద్యామిత్ర కిట్లు అందజేస్తాం. పాఠ్యపుస్తకాలు, నో టు పుస్తకాలు,డిన్షనీరలు,బెల్టు,యూనిఫాం వచ్చా యి. బ్యాగు,షూ కూడా త్వరలో అందజేస్తాం.

‘సాక్షి’తో సమగ్ర శిక్ష ఏపీసీ

డాక్టర్‌ఎన్‌.అనూరాధ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement