మదనపల్లె టౌన్: బైక్‌ను అతివేగంగా నడిపిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఆదివారం గుర్రంకొండ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం, బోడిగుట్ట కు చెందిన బాబు కుమారుడు కె. అరవింద్ (20) సొంత పనిమీద బైక్‌లో గుర్రంకొండ మండలంలోని తరిగొండకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వేగాన్ని నియంత్రించలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో కుటుంబీకులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.
ద్విచక్రవాహనం ఢీకొని..
కలకడ : ద్విచక్రవాహనం ఢీ కొని ఇద్దరు చిన్నారులుకు తీవ్ర రక్తగాయాలైన సంఘటన ఆదివారం చిత్తూరు–కర్నూలు జాతీయరహదారిపై జరిగింది. స్థానికుల కథనంమేరకు వివరాలిఉన్నాయి. రాయచోటి టౌన్‌కు చెందిన బాషా కుటుంబసభ్యులు రెండు ద్విచక్రవాహనాల్లో కలకడకు వస్తుండగా ముందుగా వెళుతున్న బైక్‌ను వెనుకనుంచి వారి మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుహేల్, మున్నా తీవ్రంగా గాయపడ్డారు, ద్విచక్రవాహనం దెబ్బతింది. గాయపడిన వారిని స్థానికులు ఆటోలో కలకడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
● యువకుడికి గాయాలు


