చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి ఊపిరిపోసింది మహానేత వైఎస్సారే. 2005 సంవత్సరం ముందు వరకు అవి శోత్రియం భూములుగా ఉండేవి. దశాబ్దాల తరబడి రైతులు భూములు సాగు చేసుకుంటున్నా ఆయా భూములపై హక్కులుగానీ, పట్టాదారుపాసుపుస్తకాలు ఉండేవి కావు. చుట్టుపక్కల గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందినా ఇక్కడి రైతులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలుగానీ, పంటసాయంగానీ అందేవి కావు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 50 ఏళ్ల శోత్రియం భూముల సమస్యకు పరిష్కారం చూపారు. ఎనిమిది విడతలుగా అక్కడి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేశారు.


