మదనపల్లె టౌన్ : భూ వివాదం తలెత్తి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేసిన సంఘటన శనివారం పెద్దమండెంలో జరిగింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పెద్దమండెంలో కాపురం ఉంటున్న దంపతులు వెంకటరమణ (60), అతని భార్య రమాదేవి (50)లకు అదే ఊరికి చెందిన సత్యనారాయణ, రామకృష్ణ, రెడ్డెమ్మలతో భూ వివాదం నడుస్తోంది. భూ సర్వే విషయమై గొడవ తలెత్తి ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దంపతులు వెంకటరమణ, రమాదేవిలపై సత్యనారాయణ, రామకృష్ణ, రెడ్డెమ్మలు మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితులను కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం పెద్దమండెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


