విద్యావ్యవస్థను నాశనం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థను నాశనం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

మదనపల్లె సిటీ: ప్రభుత్వ విద్యను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐఎస్‌ఎ్‌ఫ్‌ రాష్ట్ర అఽధ్యక్షులు జీ.వలరాజు మండిపడ్డారు. మదనపల్లెలో శనివారం ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక రాజకీయ,సైద్ధాంతిక శిక్షణ తరగతులు జరిగాయి. ప్రైవేటు,కార్పోరేట్‌ విద్యా సంస్థలను అందలం ఎక్కించాలనే నీట్‌ ప్రవేశ పరీక్షను ఎన్టీఏ లాంటి ప్రైవేటు సంస్థకు ఇవ్వడం వల్ల మూడు సార్లు ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయిందన్నారు. దీని వల్ల ఎంతో మంది పేద,మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నీట్‌ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం లీకుకు పూర్తిగా బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. యూనివర్సిటీలకు నిధులు లేకపోవడంతో పాటు ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామానాయుడు, ఏఐఎస్‌ఎప్‌ నాయకులు ఎంవి రమణ, జనార్థన్‌, మహేష్‌, మాధవ్‌, కోటేశ్వరరావు,సాంబశివ, గంగారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement