మదనపల్లె టౌన్ : తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మదనపల్లెలో మంగళవారం వెలుగు చూసింది. ఘటనపై రెండవ పట్టణ సీఐ మహ్మద్ రఫీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని చంద్రా కాలనీలో కాపురం ఉంటున్న ఫాతిమా టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసుకుని బట్టలు, దారాలు కొనుక్కొని రావడానికి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. దొంగలు అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి, లోపల ఉన్న రూ.లక్షకు పైగా విలువైన డబ్బు, బంగారాన్ని అపహరించారు. ఈ మేరకు బాధితురాలు స్థానిక 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


