వినూత్న ఆలోచన..పంటకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

వినూత్న ఆలోచన..పంటకు రక్షణ

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

పంటలను కాపాడుకొనేందుకు పొలాల్లో విద్యుత్‌ కాంతులు

అడవిజంతువుల బెడదతో తప్పని పాట్లు

లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు

తలారివాండ్లపల్లెలో వేరుశనగ పొలం వద్ద రాత్రిళ్లు వెలుగుతున్న విద్యుత్‌ లైట్లు

గుర్రంకొండ: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను అడవి జంతుల బారినుంచి కాపాడుకొనేందుకు రైతులు విన్నూత్నప్రయోగాలు చేపట్టారు. పొలం చూట్టూ రాత్రిళ్లు విద్యుత్‌లైట్లను, మరికొన్ని చోట్ల పొలాల్లో ఎఫ్‌ఎమ్‌ రెడియోలు, స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది రాత్రిళ్లు పొలం చుట్టూ ఆక్కడక్కడ కట్టెలతో మంటలు ఏర్పాటు చేసుకొంటున్నారు. పలుచోట్ల రైతులు చేపట్టిన పద్ధతులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం రబీసీజన్‌లో రైతులు పలు గ్రామాల్లో వేరుశనగ సాగు చేశారు. అక్కడక్కడ అడవిజంతువుల బెడదను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఈ ఏడాది రైతులు వీటి బారినుంచి పంటను కాపాడుకొనేందకు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ పంట చుట్టూ , మధ్యలో స్తంభాలు అమర్చి విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు విద్యుత్‌ కాంతులతో పొలం మొత్తం వెలుతురు ఉండడంతో అడవి జంతువులు అటువైపు వెళ్లడం లేదని రైతుల చెబుతన్నారు.

పంటలకు కాపలాగా ఎఫ్‌ఎమ్‌రేడియోలు..

కొంతమంది రైతులు కర్బూజాతో పాటు మరికొన్ని పంటల వద్ద ఎఫ్‌ఎమ్‌ రేడియోలను ఏర్పాటు చేశారు. ఓ చెట్టుకుగానీ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న పందిళ్ల వద్ద ముందుగా ఎఫ్‌ఎమ్‌ రేడియోలను ఏర్పాటు చేసి, దానిని రెండు స్పీకర్లకు కనెక్షన్‌ ఇస్తున్నారు. ఇవి కరెంటు సౌకర్యం లేకున్నా రాత్రిళ్లు పనిచేయడానికిగాను బ్యాటరీలను అమర్చారు. సాయంకాలం పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఎఫ్‌ఎమ్‌ రెడియోలను ఆన్‌ చేసి వెళుతున్నారు.రాత్రిళ్లు ఎఫ్‌ఎమ్‌ రెడియోలలో వచ్చే కార్యక్రమాలతో పొలమంతా శబ్దాలు వస్తుంటాయి. దీంతో జనసంచారం ఉంటుందని అడవి జంతువులు పంటల పొలాలవైపు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నాయి. దీంతో రాత్రిళ్లు పంటకు కాపాలా కాసే బాధ నుంచి రైతులు ఉపశనమనం పొందుతున్నారు. వేరుశేనగ పంటను కాపాడుకొనేందుకు రాత్రిళ్లు పొలాల చుట్టూ అక్కడక్కడ కట్టెలను కుప్పగా పోసి మంటలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఆరు గంటల పాటు కట్టెలు రగులుతూనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు దీంతో పొలాల వద్ద జనసంచారం ఉంటుందని భావించి అడవి జంతులు పొలాల వైపు రావడం లేదని రైతులు అంటున్నారు. మరికొంతమంది రైతులు పొలాల్లో అక్కడక్కడ కట్టెలను నాటి పాలథిన్‌షీట్లు. దారాలు కట్టెలకు కడుతున్నారు. ఖాళీ గాజుసీసాలను కూడా వాటికి జతచేసి ఒక వరుస క్రమంలో అమర్చుతున్నారు. పగలు, రాత్రిళ్లు అని తేడా లేకుండా అవి గాలివీచినపుపడుల్లా చప్పుళ్లు చేస్తుండడంతో జంతువులు అటువైపు రావడం లేదు. గాలిసన్నగా వీచినా రాసుకొంటుండడంతో పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఉన్న కాస్త పంటనైనా కాపాడుకోవడానికి ఇలా కష్టాలు పడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement