ఓవైపు పసికందు.. మరోవైపు ఊరకుక్కలు | - | Sakshi
Sakshi News home page

ఓవైపు పసికందు.. మరోవైపు ఊరకుక్కలు

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

చెట్టుకింద ఒంటరిగా ఉన్న చిన్నారి

చిన్నారిపై దాడి చేయడానికి చూస్తున్న ఊరకుక్కల గుంపు

గుర్రంకొండ: ఓవైపు నెలల పసికందు చెట్టుకింది కూర్చుని ఉన్నాడు...ఇదే సమయంలో అటువైపు వెళుతున్న ఊర కుక్కల గుంపుకు చిన్నారి ఒంటరిగా కనిపించింది. దాడి చేసేందుకు సిద్దమవుతుండగా గమించిన కొంతమంది వాటిని తరిమి వేయడంతో చిన్నారికి ప్రాణపాయం తప్పింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పట్టణ శివార్లలో బుధవారం జరిగింది. చూట్టు ఎవరూ లేరు. నెలలు కూడా నిండని ఓ పసికందు మాత్రం చెట్టుకింద మండుటెండలో ఒంటిరిగా ఆడుకొంటోంది. చిన్నారి పక్కనే ఓ వాటర్‌ బాటిల్‌, పాలసీసా ఉన్నాయి. పెద్దగా జనసంచారం లేని ప్రాంతం కావడంతో అసలు ఆపాప అక్కడ ఎందుకు ఉంది. ఎవరు వదిలిపెట్టి వెళ్లారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఇంతలోనే రక్తం రుచి మరిగిన ఊరకుక్కల గుంపు అటువైపు వెళుతోంది. వాటి చూపు ఒంటరి చిన్నారిపై పడింది. అక్కడే కొద్ది దూరంలొ మాటు వేశాయి. అదును చూసి దాడి చేయడానికి సిద్ధమవుతుండగా అదృష్టం కొద్ది అప్పుడే అటువైళుతున్న ఓ వ్యక్తి కంట ఈ దృశ్యం పడింది. అనుమానం కలిగి ఊరకుక్కల గుంపును చెదరగొట్టాడు. కొద్దిసేపు ఈ చిన్నారి ఎవరనే విషయం వాకబు చేశాడు. విధి విచిత్రం ఏ గూడు లేని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిగా గుర్తించాడు. పట్టణంలో కవర్లు ఏరుకొనే కుటుంబం ఉదయాన్నే కవర్లు ఏరుకోవడానికి వెళుతూ మండుటెండకు తాళలేదని నెలలు నిండని చిన్నారిని పట్టణ శివార్లలోని ఓ చెట్టుకింద వదిలిపెట్టి వెళ్లారు. ఈ చిన్నారికి తోడుకు మరో ఇద్దరు చిన్నారులను ఉంచి వెళ్లారు. తోడుగా ఉన్న మిగిలిన ఇద్దరు ఆడుకొంటూ ఎటో వెళ్లిపోయారు. దీంతో చిన్నారి చెట్టు కింద ఒంటరిగా మిగిలిపోవడంతో ఈ సంఘటన నెలకొంది. సమయానికి స్పందించడంతో ప్రాణపాయం తప్పింది.

త్రుటిలో తప్పిన ప్రాణపాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement