వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

బద్వేలు అర్బన్‌ : స్థానిక ఎన్‌జీవో కాలనీలో బుధవారం ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్‌జీవో కాలనీలో నివసిస్తున్న ఊసుపల్లిఅమ్ములు (23)కు 8 సంవత్సరాల క్రితం బాబు అనే వ్యక్తితో వివాహమైంది. బాబు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం బాబు పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నిద్రపోతుండగా రేకుల ఇంటిలోని పైపునకు అమ్ములు ఉరి వేసుకుంది. సుమారు 6 గంటల సమయంలో బాబు నిద్ర లేచి చూసే సరికి అమ్ములు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో అర్బన్‌ పోలీసులకు సమాచారమివ్వగా అర్బన్‌ ఎస్‌ఐ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఇరువురికి వేరొకరితో అక్రమ సంబంధాలు ఉండటంతో భార్యభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని తెలిసింది.

కుక్క దాడి

– 20మందికి గాయాలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కడప నగరం మారుతినగర్‌ ప్రాంతంలో బుధవారం ఓ కుక్క స్వైర విహారం చేసింది.20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ, ద్విచక్ర వాహనంలో వెళుతున్న వారిని కరవడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. బాధితులు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో శునకాలు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సత్వరమే స్పందిచి కుక్కలను పట్టుకోవాలని, నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు.

దాడిఘటనలో 8మందిపై కేసు

కొండాపురం: మండలం పరిధిలోని కొండాపురం గ్రామంలోని శాంతినగర్‌ లో నివాసం ఉంటున్న కంబాల నాగేష్‌ కుటుంబ సభ్యులపై రమేష్‌ అతని అనుచరులు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. ఈ ఘటనపై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు కొండాపురం ఎస్‌ఐ జయరాజులు బుధవారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు శాంతినగర్‌కు చెందిన కంబాల నాగేష్‌కు అతని బంధువు రమేష్‌కు పాత కక్షలు ఉండేవి.ఈ కారణంతో గురువారం రాత్రి నాగేష్‌ కుటుంబ సభ్యులపై రమేష్‌ అతని అనుచరులు కలసి దాడి చేశారు. నాగేష్‌కు అతనికుమారుడు, తల్లికి సోదరుడు లకు గాయాలయ్యాయి. ఈఘటన పై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మల్లయ్యకొండ

అగ్నికి ఆహుతి

తంబళ్లపల్లె: తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ అటవీసముదాయం అగ్నికి ఆహుతవుతోంది. మంగళవారం సాయంత్రం ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అడవిలో బోద, గడ్డి ఏపుగా పెరిగి ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. వందల ఎకరాల్లో అడవి కాలిపోయింది. విలువైన ఔషధమొక్కలు, వన్యప్రాణులు, వృక్షసంపద అగ్నికి ఆహుౖతైంది. అగ్నికీలలు ఉవ్తెతన ఎగిసిపడంతో అటవీసిబ్బంది మంటలు అర్పడానికి వీలుకాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement