పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి | - | Sakshi
Sakshi News home page

పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

రాయచోటి : జోన్‌ – నాలుగు పరిధిలోని స్కూల్‌ అసిస్టెంట్లు, సమాన హోదాల గ్రేట్‌–టు ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల సీనియార్టీలు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో కూడిన పత్రాలతో ఈమెయిల్‌ ద్వారా ఈనెల 11వ తేదిలోగా సమర్పించాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రమణ్యం పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ స్కూల్‌ అసిస్టెంట్లు సమాన హోదా నుంచి గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల విషయమై సవరించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. కావున జోన్‌–4 పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించిన స్కూల్‌ అసిస్టెంట్లు సమాన హోదాల నుంచి గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం సవరించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. సైట్‌ను పరిశీలించి అభ్యంతరాలు ఉన్న ఉపాధ్యాయులు వారికి సంబంధించిన సర్వీసు వివరాలు, సీనియార్టీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలున్నా తగిన ఆధారాలతో కార్యాలయం అధికారిక మెయిల్‌ ద్వారా సమర్పించాలన్నారు. గడువు అనంతరం పరిగణలోకి తీసుకోవడం జరగదని డీఈఓ తెలియజేశారు.

భూమిని ఆక్రమించి..

చంపాలని చూస్తున్నారు

– ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తే

తననే జైలులో వేస్తానన్నాడు

మదనపల్లె టౌన్‌: ప్రత్యర్థులు తన భూమిని ఆక్రమించి, గుడిసెను సైత ధ్వంసం చేశారు. అన్నీ రికార్డు పరంగా ఉన్నా కూడా తననే జైలులో వేస్తానని ఎస్‌ఐ ఆపోజిట్‌ వాళ్లకు ఫేవర్‌ చేస్తున్నాడని బాధితురాలు పద్మ మదనపల్లె ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం ఆరోపించింది. అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె మంలం, బోయకొండ గంగాపురానికి చెందిన పద్మ (45)కు భర్త 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో తన ఒక్కగా నొక్క కుమారున్ని కూలి పనులు చేసుకుంటూ పోషించు కుంటోంది. ఈ క్రమంలో తన భర్త తల్లి దండ్రుల నుంచి సంక్రమించిన కొంత ఆస్తి గంగాపురంలో ఉందని తెలిపింది. ఆ ఆస్తిపై కన్నేసిన పక్క భూమి యజమాని వేణు,హేమసుందర్‌, పుష్పలత తదితరలు వచ్చి మమ్మల్ని వెళ్లగొట్టి, బంకు తొలగించి నష్టపరచారని తెలిపింది. భూమిని కబ్జా చేసి ఆక్రమించడమేకాకుండా తమను చంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐ నిన్నే జైలులో వేస్తానని బెదిరిస్తున్నట్లు కంటతడి పెట్టింది. తహసీల్దార్‌ వద్దకు వెళితే మేము వేణు వాళ్లకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని చెప్పినట్లు తెలిపింది. ఎలాంటి రికార్డులు లేని వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, తమ భూమి తమకు దక్కేలా న్యాయం చేయాలని బాధితురాలు వేడుకొంది.

భూ కబ్జాను అడ్డుకున్న

మహిళపై దాడి

మదనపల్లె టౌన్‌: తన భూమిని కబ్జా చేస్తుంగా అడ్డుకున్న ఒంటరి మహిళపై భూ కబ్జా రాయుళ్లు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. బుధవారం మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలు.. పట్టణంలోని నక్కల దిన్నె తాండాకు చెందిన వెంకటరమణ నాయక్‌ భార్య బి.మునెమ్మ(44)కు మండలంలోని కోళ్లబైలు గ్రామం, ఎగువ కురంకలోని సరస్వతి నగర్‌లో సుమారు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ.. ఆమెకు వెనకా ముందు ఎవరూలేరని ఆ భూమిపై కన్నేసిన పట్టణంలోని గాంధీపురంలో ఉండే రామకృష్ణ, రామయ్య, రెడ్డెప్ప తదితరులు మునెమ్మ ఒంటరిగా పొలం పనులు చేసుకుంటూ ఉండగా వెళ్లారు. భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించడానికి పూనుకున్నారు. దీంతో మునెమ్మ వారిపై తిరగ బడడంతో మూకుమ్మడిగా ఆమైపె దాడిచేసి, కొట్టారు. స్థానికులు గమనించి బాధితు రాలిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. బాధితురాలు తాలూక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ.చంద్రమోహన్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement