ఆలయ రూములు కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

ఆలయ రూములు కూల్చివేత

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

పుంగనూరు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన లక్షలాది రూపాయలు విలువ చేసే మూడు అంగడి రూములను కొందరు మంగళవారం రాత్రి జేసీబీలతో కూల్చివేశారు. బుధవారం స్థానిక ప్రజలు గమనించి ఆందోళన చేపట్టారు. 30 సంవత్సరాల క్రితం ఆలయానికి దాతలు ఇచ్చిన అంగడి రూముల స్థలానికి విలువ రావడంతో కొంత మంది దీనిపై కన్నేసి అర్ధరాత్రి కూల్చివేసి ఆస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రూములు కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని , ఆలయ ఆస్తులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement