ఏబీఎన్‌ రాధాకృష్ణ సభ్యత, సంస్కారం నేర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణ సభ్యత, సంస్కారం నేర్చుకోవాలి

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

కడప కార్పొరేషన్‌: ఏబీఎన్‌ రాధాక్రిష్ణ సభ్యత, సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు హితవు పలికారు. రాధాక్రిష్ణ వైఎస్సార్‌సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్‌ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. మీడియా ముసుగులో రాధాక్రిష్ణ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు సైకిల్‌ మీద తిరిగే ఆయనకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మంచి, మర్యాద మరిచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే నీవు జాకీలు పెట్టి లేపే పార్టీకి మహిళలే సమాధి కడతారని హెచ్చరించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పలువురు నిరసన తెలిపారు.

లేనిపక్షంలో గుణపాఠం తప్పదు

వైఎస్సార్‌సీపీ నేతల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement