పుంగనూరు: పుంగనూరు కోర్టు సముదాయంలో రెండవ అదనపు సివిల్‌జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు కోర్టులతో కలిపి పట్టణంలో నాలుగు కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు పట్టణానికి అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదు ల సంఘ అధ్యక్షుడు ఎం.విజయ్‌కుమార్‌తో పాటు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
రాయచోటి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా డీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి బాలికల ఉన్నత పాఠశాలలో డీఎడ్ ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిస్ట్రిక్టు ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆండ్ ట్రైనింగ్ (డీఐఈటీ) ప్రైవేట్ ఎలి మెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్లలో అందిస్తున్న రెండేళ్ల కోర్సులో ప్రవేశం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్‌అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానానికి సంబంధించి వివరాలు https://cse. ap.gov.in and https://apdeecet. apcfss.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు న్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 15వ వరకు చివరి తేది అన్నారు. మరిన్ని వివరాల కోసం డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ 944024 6825కు సంప్రదించాలని కోరారు.
పెద్దమండ్యం: అత్యాధునిక సాంకేతికపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడం కోసం అటల్ బూట్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి ఎం ఓబుల్‌రెడ్డి అన్నారు. మండలంలోని కలిచెర్ల తెలుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో జరుగుతున్న బూట్ క్యాంప్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 24 టింకరింగ్ ల్యాబ్‌లలో విద్యార్థులకు సాంకేతికపై ప్రత్యక్ష అనుభవం కోసం ఈ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించవచ్చని అన్నారు. డిజైన్ ఽథింకింగ్, ప్రోటో టైపింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. పలువురు విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మీనా నాగలక్ష్మి, ఉపాధ్యాయులు హేమంత్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు: పర్యాటక కేంద్రమైన గండికోటలో మరోసారి చిరుతపులుల కలకలం మొదలైంది. మంగళవారం రెండు చిరుత పులులు నాలుగు గొర్రెలపై దాడి చేసి చంపడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంత కాలం కిందట చిరుత పులుల సంచారం ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బయటకి వెళ్లాలన్న భయంతో అల్లాడిపోయారు. దీంతో ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగి బోను పెట్టి చిరుతను పట్టుకుని తిరు పతి జూ పార్కుకు తరలించారు. ఇటీవల జమ్మలమడుగు–ముద్దనూరు రహదారిలో, అలాగే ముద్దనూరు– తాడిపత్రి రహదారిలో ఉన్న గాలేరు–నగరివరద కాలువపైన ఆటో డ్రైవర్లు వాహనదారులు చిరుతలను చూసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం గండికోటలో చిరుత పులులు 4 గొర్రెల పై దాడి చేసి చంపేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పర్యాటకులు సైతం భయాందోళన చెందుతున్నారు


