మాజీ సైనికుడి భూ ఆక్రమణకు యత్నం
మదనపల్లె : మాజీ సైనికుడినైన తన భూమిని రియల్టర్లు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూ దాడి చేసి బెదిరిస్తున్నారని బాధితుడు లక్ష్మిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక అనిబిసెంట్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీలేరు మండలం బోడుమల్లవారిపళ్లెలో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.17 ఎకరాల భూమిని పక్కనే ఉన్న రియల్టర్లు ఆక్రమించే ప్రయత్నం చేయగా అడ్డుకోబోయిన తమపై దాడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా న్యాయం చేయాలని కోరారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ లక్ష్మిప్రసాద్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులపై చర్యలు తీసుకుని నాయ్యం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో మాజీ సైనికులు రెడ్డెప్పరెడ్డి, దామోదర్‌రెడ్డి, జనార్దన్, సుబ్బరాయుడు, లక్ష్మిపతి, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


