ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం తగదు
రాయచోటి : సమస్యల పరిష్కారం కోరుతూ పరిష్కార వేదికకు వచ్చిన ప్రజా ఫిర్యాదులకు చట్టపరిధిలో సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారంలతో ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు.


