వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. నేడు తెల్లవారుజామున 1:35 నిమిషాల నుంచి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ రామాలయ అంకనాలలో నుంచి ఉత్తర ద్వారం వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలలతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామాలయం తూర్పు వైపు ఉన్న అన్నప్రసాద కేంద్రం పక్కనే అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తారు. సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటుచేసినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు తెలిపారు.
శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో..
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామి వారికి లక్ష తులసి అర్చన, ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు.
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం


