కుక్క తెచ్చిన తంటా!.
రాజంపేట : రాజంపేట–నెల్లూరు రహదారిలోని ద్వారకనగర్(రాజంపేట శివారు గ్రామం)లో సోమవారం కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు, నక్కనూతలపల్లె తాండాకు చెందిన మూడవత్తు నాగరాజు (45) మృతి చెందాడు. మన్నూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..రాజంపేట నుంచి చక్రంపేటలో కూలి పనులకు ఆటో బయలుదేరింది. ఈ ఆటోలో డ్రైవర్‌తోపాటు 8 మంది ప్రయాణిస్తున్నారు. ద్వారకానగర్ సమీపంలోకి రాగానే కుక్క అడ్డుగా వచ్చింది. అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. గాయపడిన వారిని అదే ఆటోలో చికిత్స నిమిత్తం ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో నాగరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయన రాజంపేట పట్టణంలోని ఉస్మాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు పరిశీలించారు.


