డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ్‌లు

Nov 10 2025 8:12 AM | Updated on Nov 10 2025 8:14 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మూడవ రౌండ్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల ధాటికి బ్యాటర్లు విల విల్లాడారు. రెండవ రోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో కడప–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆదివారం రెండవ రోజు 54 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 71.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ప్రణధీర్‌ 29 పరుగులు, మన్నన్‌ 26 పరుగులు చేశారు. కడప జట్టులోని భాను వర్షిత్‌ రెడ్డి 3 వికెట్లు, ముని జాన్ఞేశ్వర్‌ రెడ్డి 3 వికెట్లు, మోనిష్‌ రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 46 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆ జట్టులోని డీఎండీ తాహీర్‌ 61 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ట్రెడిక్‌ 2 వికెట్లు, కార్తీక్‌ సాయి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో...

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో చిత్తూరు –కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆదివారం రెండవ రోజు 78 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 81.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. ఆ జట్టులోని కేవీఎస్‌ మణిదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 167 బంతుల్లో 102 పరుగులు, ప్రశవ్‌ 41 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని యశ్వంత్‌ సూర్య తేజ్‌ 3 వికెట్లు, చేతన్‌ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 32 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఆ జట్టులోని మోక్షజ్ఞ రెడ్డి 63 పరుగులు, వియం శక్తి 60 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

కేవీఎస్‌ మణిదీప్‌, చిత్తూరు (102 పరుగులు)

డీయండీ తాహీర్‌, కడప

(61 పరుగులు)

మోక్షజ్ఞ రెడ్డి, కర్నూలు

(63 పరుగులు)

వియం శక్తి, కర్నూలు

(60 పరుగులు)

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ1
1/3

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ2
2/3

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ3
3/3

డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–14 మల్టీ డే మ్యాచ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement