
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మాజీ సర్పంచులు
వీరబల్లి : మండలంలోని మట్లి పంచాయతీలో కోదండరామస్వామి దేవాలయం వద్ద మాండవ్య నది నుంచి సోమవారం కొందరు వ్యక్తులు ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు వచ్చారు. విషయం గమనించిన తాటికుంటపల్లి పంచాయతీ మాజీ సర్పంచులు లక్ష్మయ్య, తిమ్మారెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నందా కలిసి ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. లోడు చేసుకున్న ఇసుకను అక్కడే దింపివేసి వెళ్లాలన్నారు. ఇసుకను ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తీసుకువెళితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ట్రాక్టర్లు తిరిగి వెళ్లిపోయాయి.
కేబుల్ వైర్ల చోరీ ముఠా ఆట కట్టించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : కేబుల్ వైర్ల చోరీ ముఠా ఆట కట్టించి అన్నదాతలను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎండపల్లి బాలకృష్ణారెడ్డి జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయం వద్ద మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రైతులు నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పంపుసెట్లకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ వైర్లను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించుకొని వెళ్తున్నారన్నారు.
షిఫ్ట్ ఆపరేటర్‌పై దాడి
మైదుకూరు : మండలంలోని ఆదిరెడ్డిపల్లె విద్యుత్ సబ్ స్టేసన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బండి సురేష్‌పై దాడి జరిగిన విషయంపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వనిపెంట సెక్షన్‌లోని ఆదిరెడ్డిపల్లె సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా శనివారం తిప్పిరెడ్డిపల్లె కొత్తపల్లెకు చెందిన మాదం నాగేశ్వరరావు వెళ్లి కరెంట్ ఇంకా ఎందుకు వదల్లేదని దాడి చేశాడు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మాజీ సర్పంచులు