
బాధితులకు సత్వర న్యాయం అందించండి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తల సుబ్బమ్మ (70) తన సమస్యను చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ ఆమె వద్దకే వెళ్లి సమస్య విన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో వృద్ధురాలి సమస్యను పరిష్కరించాలని లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐను ఆదేశించారు.
పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ