
14లోపు రైతులు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలి
సిద్దవటం : పసుపు, ఉల్లి పంటలకు సంబంధించి బీమా వర్తింపు కోస ఈనెల 14లోపు రైతులు పంట బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యాన శాఖ అఽధికారి జయభరత్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలంలోని బొగ్గిడివారిపల్లె గ్రామంలో సోమవారం పసుపు పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట బీమా కోసం ఈ– పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన కింద పసుపు, ఉల్లి పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 14 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందన్నారు. పసుపు పంటకు ఎకరాకు రూ. 180, ఉల్లి పంటకు ఎకరాకు రూ.90 చెల్లించాలన్నారు. పుసుపు పంటకు బీమా మొత్తం హెక్టారుకు రూ. 2, 25000, ఉల్లికి బీమా మొత్తం హెక్టారుకు రూ. 1,12,500 వర్తిస్తుందని తెలిపారు.