
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
నందలూరు : మండలంలోని చింతకాయపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు రేషన్‌షాపు మార్పిడి విషయమై ఘర్షణ పడ్డారు. ప్రభుత్వం మాది మేము చెప్పినట్లే వినాలంటూ టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకుడు చింతకాయల ఎల్లయ్యపై దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన చింతకాయల నరసింహులుపై కత్తితో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది. చింతకాయల శేషాద్రిపై రాడ్‌తో దాడి చేయడంతో భుజానికి తీవ్రంగా గాయమైంది. క్షతగాత్రుడిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి బంధువులు తరలించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసిన చుక్కా నీలేష్, చుక్కా కొండయ్య, చుక్కా చంద్ర, చుక్కా శశిధర్, చుక్కా మణెమ్మ, చుక్కా వెంకటేష్, చుక్కా చంద్రలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి