
రూపానంద రెడ్డి అండతో ప్రభుత్వ భూమి కబ్జా
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పుల్లంపేట మండలం అనంతసముద్రం, కొమ్మనవారిపల్లి గ్రామాలలో టీడీపీ ఇన్‌చార్జి రూపానందరెడ్డి అండతో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంత సముద్రం గ్రామానికి చెందిన ముద్దా సుబ్బారెడ్డి ఆయన కుమారుడు ముద్దా సుభాష్‌లు 40 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారని తెలిపారు. అనంత సముద్రంలో సర్వే నెంబరు. 326, 330/3, 331, 339/1, 1194/2లో ఉండే ప్రభుత్వ భూములే కాకుండా గ్రామ కంఠం సర్వే నెంబర్లకు సంబంధించి 327/2, 328, 329, 321/1లో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు ఆక్రమించుకున్నారన్నారు. అలాగే కేతు సుబ్బరామిరెడ్డి, కేతు రజనీకాంత్ రెడ్డిలు 13 ఎకరాల భూమిని సర్వే నెంబరు. 1089/1, 128/1, 129/1లలో ఆక్రమించుకున్నారన్నారు. అనంతసముద్రం ఎంపీటీసీ కుమారుని భూమిని సైతం ఆక్రమించారని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.